ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి దేశంలో పెరుగుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య దేశంలో పెరుగుతూ వస్తోంది. అయితే మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో దేశంలో థర్డ్ వేవ్ సృష్టించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు థర్డ్ వేవ్‌ను ప్రారంభంలోనే అదుపలోకి తీసుకువచ్చాయి. ఫస్ట్, సెకండ్ వేవ్‌లు అనుభవాలతో ముందుగానే థర్డ్ వేవ్‌ను అదుపు చేశారు.
అయితే ఇప్పుడు మరోసారి కరోనా రక్కసి రెక్కలు విరిస్తోంది. అయితే ఇప్పటికే చైనా లాంటి దేశాల్లో కరోనా విజృంభనతో భారీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మహా నగరం శాంఘైసిటీని లాక్‌డౌన్‌లో ఉంచారు. అంతేకాకుండా అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కోవిడ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ముళ్ల కంచెలు వేసి.. ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడంలేదు. అయితే ఇప్పుడు భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమతమ ప్రజలకు సూచనలు ఇచ్చాయి. మాస్క్, శానిటేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని, గుంపులుగా ఉన్నప్పుడు మాస్క్ ఖచ్చితంగా ధరించాలని సూచనలు చేస్తున్నా ప్రభుత్వాలు. మాస్క్ ధరించకుంటే కోవిడ్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా వెంటనే వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని ఆయా ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.