విద్యార్థులకు సైతం ఫేషియల్ రికగ్నిషన్.. డిసెంబర్ నుంచే అమలు

-

ఉన్నత విద్యాశాఖలో అటెండెన్స్ విషయంలో కీలక మార్పులు తీసుకుని రానునుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులకు సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

cm jagan

ఈ నెలాఖరులోగా విద్యార్థులు అందరిని యాప్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తోంది ఉన్నత విద్యా మండలి. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అన్ని కోర్సుల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే హాజరు కావాల్సి ఉంటుంది. కేవలం రెండు నిమిషాల్లోనే విద్యార్థుల హాజరును నమోదు చేసే విధానం యాప్ రూపకల్పన చేశారు. జియో ట్యాగింగ్ సాంకేతిక ద్వారా ఆ యా కాలేజీల్లో మాత్రమే యాప్ పని చేసే విధంగా డిజైన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version