డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇకనుంచి కాలేజీలలో త్వరలోనే ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలులోకి రాబోతోంది. ఈ విషయం పైన చర్చించేందుకు ఈరోజు అన్ని యూనివర్సిటీల VC లతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్ణయించబోతోంది. కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. కాగా అన్ని విద్యాసంస్థలలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవలే జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

దీంతో ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలులోకి తీసుకురావాలని అధికారులు హెచ్చరించారు. దీనివల్ల విద్యార్థులు తప్పనిసరిగా కాలేజీలకు వస్తారని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల సంఖ్య చాలా తగ్గుతుందని విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో అనేక రకాల మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల వరకు విద్యాశాఖ అధికారులు అనేక రకాల మార్పులు చేయనున్నారు.