గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ షాక్..వచ్చే నెల నుంచే ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ !

-

గ్రామ, వార్డు సచివాలయా ల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులకు సూచించారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని.. దానివల్ల మంచి పేరు వచ్చిందన్నారు. మళ్లీ ఎ లాంటి లోపం లేకుండా సమర్థవంతంగా వీరి నియామక ప్రక్రియను చేపట్టాలన్నారు.

అన్ని ప్రభుత్వ విభాగాలనుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని సీఎంకు తెలిపారు అధికారులు. అలాగే ఆ ఉద్యోగులకు ఊహించని షాక్ కూడా ఇచ్చారు జగన్‌. ఈ నెలాఖరు కల్లా రాష్ట్రసచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకూ కూడా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు అమలు చేయాలన్నారు. అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్‌ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌తో నడుస్తున్న 2,909 గ్రామ సచివాలయాలను వైర్డ్‌ఇంటర్నెట్‌తో అనుసంధానం చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version