ఫ్యాక్ట్ చెక్: ఇలాంటి ఆఫర్స్ ని నమ్మచ్చా..? పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఏం అంటోంది..?

-

నకిలీ వార్తలకి హద్దు లేకుండా పోతోంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో మనకి నకిలీ వార్తలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక్కొక్క సారి కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే అది నిజమా కాదా అనేది కూడా తెలియడం లేదు. చాలా మంది నకిలీ వార్తలు కారణంగా మోసపోతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటోంది. స్మార్ట్ ఫోన్ కి సంబంధించి కొన్ని విషయాలలో కూడా నకిలీ వార్తలు వినబడుతున్నాయి.

ఫ్రాడ్స్టర్స్ మోసం చేయాలని వివిధ రకాల లింక్స్ ని పంపిస్తున్నారు. వాటి మీద క్లిక్ చేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రీ ఇంటర్నెట్ ఆఫర్లని.. లోన్స్ అని ఇలా చాలా మనకి కనపడుతూ ఉంటాయి అయితే ఎప్పుడైనా సరే స్మార్ట్ ఫోన్ కి ఫ్రీగా రీఛార్జ్ చేయొచ్చని ఏదైనా లింక్ ఇస్తే దాని మీద అసలు క్లిక్ చేయకండి. అలానే వ్యక్తిగత వివరాలని అసలు ఇవ్వకూడదు.

పైగా ఫ్రీగా రీఛార్జ్ అని లేదా లోన్స్ కూడా తక్కువ వడ్డీకి ఇస్తామని వస్తుంటే వాటిని నమ్మాడు. అలానే ఏదైనా నకిలీ వార్త కనబడితే వాటిని ఫార్వర్డ్ చేయొద్దు డిలీట్ చేయడం మంచిది. తాజాగా పిఏపీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ విషయం గురించి చెప్పింది. ఆన్లైన్ రీఛార్జ్ ఫ్రాడ్స్ ని ఈ చిన్న చిన్న చిట్కాల తో తప్పించుకోవచ్చని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చెప్పింది కాబట్టి తప్పులు చేయద్దు అనవసరంగా మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version