ఫ్యాక్ట్ చెక్: కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రీఛార్జ్..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు విపరీతంగా ఎక్కువైపోయాయి. చాలామంది నకిలీ వార్తలు వలన మోసపోతున్నారు. నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎంతో మంది నకిలీ వార్తలను చూసి నిజం అని భావిస్తున్నారు. పైగా వాటిని ఇతరులకి కూడా పంపిస్తున్నారు.

ఉద్యోగాలు మొదలు స్కీముల దాకా ఎన్నో నకిలీ వార్తలు ఈ మధ్య కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వార్తలతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మోసపోవాల్సి ఉంటుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తని చూస్తే.. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని ఇస్తోందని.. ఫ్రీగా మొబైల్ రీఛార్జ్ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఈ స్కీమ్ ద్వారా 28 రోజులకి 239 రూపాయలు ఫ్రీగా రీఛార్జ్ చేయించుకోవచ్చు అని ఆ వార్త లో ఉంది.

నిజంగా ఇలాంటి స్కీమ్ ని కేంద్రం తీసుకు వచ్చిందా..? ఫ్రీగా రీఛార్జ్ ని పొందచ్చ అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇలాంటి నకిలీ వార్తలని చూసి అనవసరంగా మోసపోకండి. ఇలాంటి స్కీం ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది కనుక అనవసరంగా ఇలాంటి వార్తలు నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version