వందేళ్లు బతకాలంటే వీటిని ఖచ్చితంగా తీసుకోండి..!

-

ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ప్రతి రోజు మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం.. ఒత్తిడి లేకుండా ఉండడం బాగా నిద్రపోవడం మంచి నీళ్లు తీసుకోవడం ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కాలం బతికి ఉండాలని అనిపిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని అనిపిస్తుంది.

మీరు కూడా అలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కచ్చితంగా ఇలా చేయండి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాన్ని తీసుకోండి. మనం తీసుకునే ఆహారం వలన గ్లూకోజ్ ఎంత వేగంగా రక్తం లో కలుస్తుందనేది జిఐతో లెక్కిస్తారు కాబట్టి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే వాటిని తీసుకోండి.

దంపుడు, బియ్యం పొట్టు తీయని ధాన్యాలలో ఇది తక్కువ ఉంటుంది. అలానే ఆపిల్ నారింజలలో కూడా ఇది తక్కువ ఉంటుంది. చేపలు చికెన్ లో కూడా ఇది తక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని మీరు డైట్ లో తీసుకుంటూ ఉండడం మంచిది. అలానే బ్రోకలీలో కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా తీసుకోవచ్చు. ఆకు కూరల్లో కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఆలోచించకుండా ఆకుకూరలు కూడా తీసుకోండి. ఇలా మీరు ఈ ఆహార పదార్థాలని డైట్ లో తీసుకుంటే ఖచ్చితంగా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version