ఫ్యాక్ట్ చెక్: మధ్యప్రదేశ్ లో రెస్క్యూ ఆపరేషన్ జరిగిందా..? అసలు నిజమేంటి..?

-

మధ్యప్రదేశ్ లో భారీగా వర్షాలు పడటం వల్ల వరదలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని వల్ల చాలా ప్రాపర్టీ లు నాశనం అయిపోయాయి. ఎంతో మంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వరద నీరు ఎక్కువగా ఉండడం వల్ల రోడ్లు బ్రిడ్జిలు పొలాలు కూడా మునిగిపోయాయి. షియోపూర్ జిల్లాలో అయితే వంద మంది ప్రజలని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కాపాడింది. అయితే వరదల వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి పరిహారం కూడా ఇస్తామని చీఫ్ మినిస్టర్ ఎంపీ శివ రాజ్ సింగ్ చౌహాన్ అనౌన్స్ చేయడం జరిగింది.

 

ఇదిలా ఉంటే తాజాగా షియోపూర్ లో రెస్క్యూ ఆపరేషన్ జరిగిందని దానికి తగ్గ వీడియోలు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోల లో బురద నీరు దగ్గర హెలికాప్టర్ ని మనం చూడొచ్చు అయితే ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం.

వన్ ఇండియా చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే రెస్క్యూ ఆపరేషన్ జరిగింది మధ్యప్రదేశ్లో కాదని తెలుస్తోంది. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అనంతపూర్ లో జరిగిన దానిని మధ్యప్రదేశ్ లో జరిగినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయని తెలుస్తోంది. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. ఈ వీడియో క్లిపింగ్స్ లో ఏ మాత్రం నిజం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version