ఫ్యాక్ట్ చెక్: గవర్నమెంట్ యోజన కింద రూ. 2,67,000 మీ అకౌంట్ లో పడ్డాయని మెసేజ్ వచ్చిందా..? ఇందులో నిజమెంత..?

-

సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్తలని తరచూ చూస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సింది మనమే. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

 

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే మరి అందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ యోజన కింద ప్రభుత్వం రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలని ఇస్తోందని.. ఫోన్ల కి మెసేజ్లు వస్తున్నాయి. పైగా మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయని ఆ మెసేజ్ లో వుంది అయితే నిజంగా గవర్నమెంట్ యోజన కింద ప్రభుత్వం ఈ డబ్బులు ఇస్తుందా..? ఇందులో నిజం ఎంత అనేది చూస్తే…

ప్రభుత్వం ఇలాంటి స్కీములు ఏమీ తీసుకు రాలేదని ఈ డబ్బులు ఇవ్వడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. మెసేజ్ లో ఉన్న వార్త అంతా కూడా కేవలం నకిలీ వార్త మాత్రమే. నిజానికి ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇటువంటి మెసేజ్లు కి దూరంగా ఉండటం మంచిది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వచ్చినప్పటికీ మీరు నమ్మకండి. ప్రభుత్వం ఇలాంటి స్కీములు ఏమీ తీసుకు రాలేదు.

పైగా డబ్బులు కూడా వేయలేదు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించింది ఈ వార్త కేవలం నకిలీ వార్త అని ఇందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కనుక ఇలాంటి మెసేజ్లు వస్తే అనవసరంగా నమ్మి మోసపోకండి. ఇది కేవలం నకిలీ వద్ద మాత్రమే. అలానే ఇలాంటి ఫేక్ వార్తలను ఇతరులకు షేర్ చేసి అనవసరంగా వాళ్లకి కూడా ఇబ్బంది కలిగించకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version