Fact Check : వైజాగ్ ఎల్‌జీ ప‌రిశ్ర‌మ‌లో రెండో సారి గ్యాస్ లీకైందా..?

-

ప్ర‌స్తుత త‌రుణంలో సామాజిక మాధ్య‌మాల్లో అనేక మంది ప‌నిగ‌ట్టుకుని మ‌రీ న‌కిలీ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. ఫేక్ న్యూస్‌ను ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నా వారు విన‌డం లేదు. దీంతో ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌లుగుతోంది. ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. తాజాగా వైజాగ్ గ్యాస్ లీకైన ఘ‌ట‌న‌పై కూడా కొంద‌రు ఫేక్ న్యూస్‌ను ప్ర‌చారం చేస్తున్నారు.

వైజాగ్ ఎల్‌జీ పాలిమ‌ర్స్ ప‌రిశ్ర‌మ‌లో రెండోసారి గ్యాస్ లీకైందంటూ కొంద‌రు న‌కిలీ వార్త‌లను ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేద‌ని ఫ్యాక్ట్‌చెక్ ద్వారా వెల్ల‌డైంది. ఏపీ పోలీసులు కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. ప్ర‌స్తుతానికి ప‌రిశ్ర‌మ‌లో గ్యాస్ లీక్ ఏదీ జ‌ర‌గ‌లేద‌ని, వాయువు బ‌య‌ట‌కు రాకుండా అన్నిర‌కాల జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఏపీ పోలీసులు స్ప‌ష్టం చేశారు.

కాగా ఆ ప‌రిశ్ర‌మ‌లో గురువారం రాత్రి కూడా వాయువులు లీకైన‌ట్లు ప్ర‌చారం చేశారు. కానీ అందులో ఎంత‌మాత్రం నిజం లేద‌ని పోలీసులు తెలిపారు. ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version