ఫ్యాక్ట్ చెక్; బ్రెడ్ ప్యాకెట్ కి ఉమ్ము రాస్తున్న వ్యక్తి..?

-

కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పుడు ఏ ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సరే దానిని చూసి జనం నిజమే అనుకునే పరిస్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్తితి ఉంది. జనాల నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని… ఇప్పుడు విస్తృతంగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాగే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఒక లారీ వద్ద ఒక వ్యక్తి బ్రెడ్ ప్యాకెట్ లకు ఉమ్ము రాస్తూ ఉంటాడు. ఇక తన చేత్తో వాటిని నొక్కడం వీడియో లో కనపడుతుంది. ఇక దీన్ని మతానికి జోడించి “స్పిట్ జిహాద్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది భారత్ లో ఎక్కువగా వైరల్ అవుతుంది. మన దేశంలోనే దీన్ని తయారు చేసారని అంటున్నారు. దీనికి ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. బ్రెడ్ ప్యాకెట్ ని కొనవద్దు అని సంకేతాలు ఇస్తున్నారు.

దీనిపై జాతీయ మీడియా ఆరా తీసింది. విచారణ లో ఇది నిజం కాదని వెల్లడైంది. ఈ వైరల్ వీడియో భారతదేశం నుండి వచ్చినది కాదని, దీనికి కరోనా వైరస్ కు ఎలాంటి సంబంధం లేదని గుర్తించారు. ఈ వీడియో ఫిలిప్పీన్స్‌కు చెందినదని పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో దీన్ని బయటపెట్టారని గుర్తించారు. ఇక ఆ వీడియో లో అతను బ్రడ్ ని దొంగలిస్తూ దానికి రబ్బర్ పెడుతూ ఉంటాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version