ఫ్యాక్ట్ చెక్: పాన్ కార్డుని అప్డేట్ చెయ్యండి… SBI ఏం అంటోందంటే..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో సేవలు అందిస్తోంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లని పాన్ నెంబర్ ని అప్డేట్ చేయమని చెబుతున్నట్లు ఒక మెసేజ్ వస్తోంది. అయితే నిజంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు పాన్ నెంబర్ అప్డేట్ చేయమని అంటోందా..? ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

ఎప్పుడూ కూడా మీకు వచ్చే ఈ మెయిల్స్ ని కానీ SMS లని కానీ పట్టించుకోకండి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటోంది. పాన్ నెంబర్ ని అప్డేట్ చేసుకోమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం లేదు. పాన్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే యోనో ఎకౌంట్ క్లోజ్ అయిపోతుంది అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. ఇందులో ఏమాత్రం నిజం లేదు కనుక అనవసరంగా మోసగాళ్ల చేతిలో పడకండి. దీనితో మీరే నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి నకిలీ వార్తలకి దూరంగా ఉండండి లేకపోతే ఇరుకులో పడతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version