బురిడీ బాబా.. నాలుగు మేకులు కొట్టి రూ.2.5 లక్షలు మింగాడు..

-

ప్రజల అమాకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి పూజలు చేస్తామని కొందరు, మాయమాటలతో మరికొందరు అమాయకులను దొంగ బాబాలు మోసం చేసిన అనేక ఘటనలు చూసాం. కానీ.. ఈ బాబా కేవలం నాలుగు కేవలం నాలుగంటే నాలుగు మేకులతో ఓ మహిళను బురిడీ కొట్టించి లక్షలు కొట్టేశాడు. ఈ విచిత్ర మోసం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన సుకర రజని మచిలీపట్నం ఇనుకుదురులో రూ.35 లక్షలతో 14 సెంట్ల స్థలాన్ని కొనుగోలుచేసింది. అయితే ఆ స్థలాన్ని విక్రయించి బాగా లబ్ధిపొందాలని భావించింది. కానీ ఆమె కోరిక నెరవేరడం లేదు.

ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టి నెలలు గడుస్తున్నా కొనే నాదుడే కరువయ్యాడు. స్థలంలో ఏమైనా దోషం ఉందా అనే అనుమానంతో ఆమె మచిలీపట్నంలోని ఓ బాబాను ఆశ్రయించింది. స్థలం అమ్ముడు పోవడం లేదనే విషయాన్ని బాబా వద్ద చెప్పుకొచ్చింది. తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంది. అయితే ఆ స్థలం అమ్ముడు పోవాలంటే నాలుగు మేకులు కొట్టాలని ఆ బాబా నమ్మబలికాడు. రూ.2.50 లక్షలు తీసుకుని ఆ స్థలంలో నాలుగు మేకులను నాలుగు దిక్కులలో దించాడు. ఇప్పుడు స్థలం అమ్ముడు పోతుందని చెప్పుకొచ్చాడు. బాబానే స్వయంగా రంగంలోకి దిగి 100 గజాల స్థలాన్ని అమ్మించాడు. తన పూజల ఫలితమే భూమి అమ్ముడు అయ్యిందని తనకు రూ.4లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని రజనీని భయపెట్టాడు. రోజు రోజుకు బాబా వేధింపులు తీవ్రమవ్వడంతో రజనీ పోలీసులను ఆశ్రయించింది.ఇనకుదురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version