నకిలీ వైద్యులు, ఆర్ఎంపి, పీఎంఎపీ వ్యవస్థల మీద ఉక్కుపాదం. అధికారులు ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలవపేతానికి ప్రణాళికను సిద్ధం చేశారు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎంఎంసీ చట్టం ప్రకారం 19 మంది నకిలీ వైద్యుల మీద కేసులు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం మొదటిసారి ఐదు లక్షల ఫైన్. ఒక సంవత్సరం జైలు శిక్షణ విధించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు ముసుగులో యాంటీబయటిక్, స్టెరాయిడ్, షెడ్యూల్ హెచ్ డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ రాసే ఎవరిని కూడా ఉపేక్షించబోమని టీఎస్ఎంసి అధికారులు చెప్పారు.
వ్యవస్థలు ఏర్పాటుతో ఇంకా దాడులకి స్పష్టమైన ప్రణాళిక ఉంది అని అన్నారు సేవ ముసుగులో నకిలీ వైద్య వ్యవస్థలు ప్రజల్ని దోచుకుంటున్నట్లు చెప్పారు. కమిషన్ల కోసం నూతనంగా హాస్పిటల్ ఓపెన్ చేసిన క్వాలిఫై డాక్టర్ల లక్ష్యంగా బెదిరిస్తూ ఉన్నారన్నారు. గ్రామాల్లో అత్యవసర వైద్యం అందిస్తున్నామని 75% నుండి 80% నకిలీ వైద్యులు ఆర్ఎంపి పిఎంపి వ్యవస్థ పట్టణాల్లో తిష్ట వేశారని చెప్పారు.