టీడీపీ వాళ్లని చూసి నేర్చుకోండి..వాళ్లను ఫాలో అవ్వండి అని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. పిఠాపురంలో ప్రతి ఓటర్‌తో ఫోటో దిగుతానని… రోజుకు 200 మంది ఓటర్లలో పిఠాపురం నియోజకవర్గంలోని అందరితో ఫోటో దిగుతాని చెప్పారు. పిఠాపురంలో మెజారిటీ ఎంత రావాలి అనేది మీకే వదిలేస్తున్నానని వివరించారు పవన్ కళ్యాణ్.
నన్ను, సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయన్నారు. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.