మహారాష్ట్రలో నకిలీ ముఖ్యమంత్రి శిందే అరెస్టు

-

కొందరు కేటుగాళ్లు అమాయకులను మోసం చేయడంలో రాటుదేలి పోయారు. మొన్నటి వరకు ఉన్నతాధికారులు, సెలబ్రిటీల పేరుతో, వేషధారణతో మోసాలకు పాల్పడేవారు ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధుల ముసుగులో చీటింగ్ చేస్తున్నారు. మహారాష్ట్ర సీఎం శిందే వేషధారణతో ఓ వ్యక్తి అమాయక ప్రజలను మోసం చేశాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అసలేం జరిగిందంటే..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే వేషధారణలో ప్రజలను మోసగిస్తున్నాడు పుణెకు చెందిన విజయ్ మానే అనే వ్యక్తి. కొన్ని రోజులుగా శిందే వేషధారణలో బయట తిరుగుతూ ప్రజలను పట్టిస్తున్నాడు. మోసపోయిన వారు అసలు విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బండ్‌గార్డెన్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

నిందితుడు విజయ్.. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఓ ఫొటోలో సీఎం శిందే నిలబడి ఉండగా.. నేరస్థుడు శరద్ మోహల్ కుర్చీలో కూర్చునట్లు కనిపించాడు. విజయ్ మానే నిత్యం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేలా దుస్తులు ధరించి పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఓ నేరస్థుడితో సత్రంలో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సీఎం శిందే ప్రతిష్ఠను దెబ్బ తీసేలా నిందితుడు విజయ్ మానే ప్రవర్తిస్తున్నాడని కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version