సర్కారీ కొలువు కోసం మైనర్ తో పేపర్ పెళ్లి !

-

ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలా ? ఊరికే రాదు కదా… అందుకే ఆ సర్కారీ కొలువు కోసం ఇల్లీగల్ పని చేసి దొరికిపోయింది ఓ యువతి. విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలంలోని లాల్‌ సింగ్ తండాలో అంగన్‌ వాడి పోస్టు కోసం…అదే తండాకు చెందిన కవిత దర ఖాస్తు చేసుకుంది. ఐతే పెళ్లి అయిన వారికే ఈ అంగన్ వాడీ ఉద్యోగం అనే నిబంధన ఉండటంతో ఆమె అదే తండాకు చెందిన తనకంటే చిన్నవాడు, మైనర్‌ అయిన నరేశ్‌ తో పెళ్లి జరిగినట్లు మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ కోసం దరఖాస్తు చేసుకుంది.

ఉద్యోగం కోసం వారిద్దరు ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారన్న మాట. అయితే ఎంక్వైరీ చేయాల్సిన అధికారులు లంచమే తిన్నారో లేక ఒళ్ళు బద్ధకంతో ఎంక్వైరీ చేయలేదో కానీ గుడ్డిగా సంతకాలు చేశారు. అంతే కాదు మీకు పెళ్లి అయిపోయింది పో అంటూ ఆమెకు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. దీంతో విషయం తెలసుకున్న గ్రామస్తులు ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో ఫరూక్‌నగర్‌ తహశీల్దార్‌ మీద శాఖాపర విచారణకు ఆదేశించారు ఆర్డీవో.

Read more RELATED
Recommended to you

Exit mobile version