ఏపీలో 5 రోజుల్లో రేషన్ కార్డ్ ఫేక్…!

-

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జరిగే తప్పుడు ప్రచారాలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏపీ లో 5 రోజుల్లో రేషన్ కార్డు వస్తుంది అనే ప్రచారం తప్పు అనే విషయం అర్ధమైంది. 5 రోజుల్లోనే రేషన్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంటూ ఒక పోస్ట్ బాగా వైరల్ అవ్వడం దాని మీద మీడియా కథనాలు రాయడం అనేది జరుగుతుంది. దీనిపై మీ సేవ స్పందించింది.

ఈ ప్రచారం నమ్మి చాలా మంది మీసేవకు వెళ్లి రేషన్ కార్డు కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. దీనిపై మీ సేవ సంస్థ డైరెక్టర్ ఓ ప్రకటన జారీ చేస్తూ అది అంతా తప్పుడు ప్రచారం అని స్పష్టం చేసారు. అది కేవలం ఫేక్ న్యూస్ అని ఆ ప్రకటనలో పేర్కొంది. కొత్త రేషన్ కార్డులు అప్లే చేసుకునే విధానం మీసేవలో లేదని ఆ సంస్థ డైరెక్టర్ స్పష్టం చేసారు. కొత్త రేషన్ కార్డులు కావాలంటే కేవలం గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా మాత్రమే,

ఆంధ్రప్రదేశ్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ చెప్పినట్టు స్పందన కార్యక్రమం ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులను పొందవచ్చని ఆయన సూచించారు. ఐదు రోజుల్లో మీసేవ ద్వారా రేషన్ కార్డు వస్తుందనే ప్రచారం ఫేక్ అని స్పష్టంగా చెప్పారు. ఏపీలో చాలా మందికి కొన్ని కారణాలతో రేషన్ కార్డులను తొలగించిన సంగతి తెలిసిందే. దీనితో వాళ్ళు అందరూ క్యూ కట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version