బ్రేకింగ్;భారత సైన్యంలో దూరిన కరోనా…

-

కరోనా వైరస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు భారత సైన్యంలోకి కూడా కరోనా వైరస్ దూరింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పోలీసులకు సోకింది. మహారాష్ట్రలో దాదాపు 30 మంది పోలీసులకు కరోనా సోకింది. విమానాశ్రయ భద్రతా సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకింది. తాజాగా ఇండియన్ నేవీకి కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది. ముంబై తీరంలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుంది.

ముంబై తీరంలో కరోనా కారణంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. 23 మంది నేవీ సిబ్బందికి కరోనా సోకింది అని ఇప్పటికే ఆర్మీ కీలక ప్రకటన చేస్తుంది. ఐఎన్ఎస్ అంగ్రే లో పని చేస్తున్న 25 మందికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. ముంబై తీరంలో అంగ్రే ని అధికారులు పూర్తిగా క్వారంటైన్ చేసారు. అందులో ఉన్న సైనికులకు అందరికి కరోనా పరిక్షలు చేస్తున్నారు.

ఇది ముంబై తీరంలో ఉంటూ వెస్టరన్ కమాండ్ కి మౌలిక సదుపాయాలను అందిస్తుంది. కరోనా సోకినా వాళ్ళు అందరూ కూడా 22 నుంచి 29 ఏళ్ళ మధ్య ఉన్న వారే అని సమాచారం. జాబితాలో అధికారులు ఎవరూ లేదు. ఇప్పుడు అందులో ఉన్న అందరికి కరోనా సోకింది ఏమో అని అనుమానం వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version