కమాండ్ కంట్రోల్ సెంటర్లో నకిలీ పోలీస్.. రూ.2.82 లక్షలు స్వాహా

-

హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్‌ఫోర్స్ పోలీసునంటూ మూడు సార్లు వచ్చి వెళ్ళాడు. అంతేకాకుండా, ఓ వ్యక్తి వద్ద రూ.2.82 లక్షలు కాజేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్‌లో కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసిన నిందితుడు.. తాను టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని నమ్మించాడు.హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి వద్ద రూ.2.82 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. తన ముందే పలుమార్లు ఐసీసీసీ నుంచి బయటకు రావడంతో నిజంగానే టాస్క్‌ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి నమ్మి మోసపోయాడు. నిజం గ్రహించాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news