ప్రముఖ హీరోయిన్ .. జాతీయ ఉత్తమ నటి అయిన అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. దాదాపు పాతికేళ్ళ తర్వాత చోర్ బజార్ అనే సినిమాతో తెలుగు తెరపై మళ్లీ కనిపించబోతోంది. ఈ చిత్రాన్ని జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహానా సిప్పి నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన అర్చన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. దీంతో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
తెలుగులో తక్కువ సినిమాలే నటించినప్పటికీ తమిళం కన్నడ, మలయాళం లో కూడా ఒక ఫిలిం లో నటిస్తున్నానని తెలియజేసింది. అయితే దర్శకుడు ఈ సినిమాలో నటించడం కోసం ఆమెను సంప్రదించగా తనకు సినిమాల్లో చేసే ఆసక్తి లేదని తెలియజేసిందట. ఇక పోతే తాను వివాహం చేసుకోకపోవడానికి కారణం ఆ స్టార్ హీరో అని తెలిపిన ఆమె అతని పేరు మాత్రం బయటపెట్టలేదు. అయితే ఆ తర్వాత తన మనసు మార్చుకొని తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది. ఈ సినిమాలో ఎవరికి తల్లి గా నటించాలి.. ఎవరికి వదిన గా నటించాలని.. అడిగినప్పుడు మీరు ఎవరికీ ఏది కాదు ఒక తల్లి మీ పాత్ర కు సొంత వ్యక్తిత్వం ఉండేటువంటి క్యారెక్టర్ ఉంటుంది అని డైరెక్టర్ జీవన్ రెడ్డి తెలిపారు. ఇక సినిమా గురించి కేవలం ఒక లైన్ చెప్పమని అడగగా మీరు అమితాబచ్చన్ అభిమానులు ఆయన ని ప్రేమిస్తూ ఉంటారు ఆయన కోసం వివాహం కూడా చేసుకోకుండా ఉంటారని తెలిపారు ఆ వెంటనే షూటింగ్ ఎప్పుడు అని అడిగాను అని తెలియజేసింది నటి అర్చన.