BREAKING : హైదరాబాద్‌ లో ప్రముఖ సింగర్‌ ఆత్మహత్య

-

హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ లోని… చంపాపేట లో ప్రముఖ సింగర్ సూసైడ్ చేసుకున్నాడు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ సింగర్ హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలగిరి సాగర్ మండలం పిల్లి గుండ్ల తండాకు చెందిన జటావత్ మోహనే ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంపాపేటలోని తన గదిలో సింగర్ జటావత్ మోహన్‌ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది.

సింగర్‌ జటావత్ మోహ నే పాడిన పలు బంజారా పాటలు యూ ట్యూబ్ లో ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఇక సింగర్‌ మోహన్ మృతితో పిల్లి గుండ్ల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులకు స్థానికులు చెప్పారు. ఇక దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version