మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కలకలం చోటు చేసుకుంది. భూ సమస్యతో విసుగెత్తి తహసిల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ రైతు. రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించినా, తాపీగా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు తహసిల్దార్ పులి రాజు. తహసిల్దార్ కార్యాలయంలో గొడవ చేస్తున్న నేపథ్యంలో…. అందరూ షాక్ అయ్యారు. కానీ తహసిల్దార్ పులి రాజు సైలెంట్ గా కూర్చుండిపోయాడు.

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామానికి చెందిన రైతు గజ్జల కృష్ణయ్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తన తల్లిని తహసిల్దార్ ఆఫీసుకు తీసుకువచ్చి… రైతు గజ్జల కృష్ణయ్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. మరి దీనిపై ఉన్నాతాధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సి ఉంది.
భూ సమస్యతో విసుగెత్తి తహసిల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతు
రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించినా, తాపీగా ఫోన్ చూస్తూ కూర్చున్న తహసిల్దార్ పులి రాజు
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామానికి చెందిన రైతు గజ్జల కృష్ణయ్య ఆత్మహత్యాయత్నం pic.twitter.com/AbEEIJJufN
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2025