ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..లేఖ రాసి మ‌రీ

-

ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియుడి సంఘ‌ట‌న మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. “వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా” అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువకుడు. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన హితవర్షిణి (20) అనే యువతి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

sucide
sucide

సెలవులు ముగిసిన నేప‌థ్యంలో కళాశాలకు వెళ్లడానికి హైదరాబాద్ వచ్చిన ఆమె, బీబీనగర్–ఘట్‌కేసర్ మధ్య రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకుంది. చివరిగా తన గ్రామానికి చెందిన **వినయ్ బాబు (28)**తో ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి విచారించడానికి వెళ్లిన వినయ్ బాబు కూడా తీవ్ర మనస్థాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. “వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటా” అని రాసి మ‌రి ఆ యువ‌కుడు సూసైడ్ చేసుకున్నాడ‌ట‌. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుందని పోలీసులు తేల్చారు. వినయ్ బాబు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news