తెలంగాణ ప్రభుత్వంలో అధికార పర్యవేక్షణ లేకపోవడంతో అన్నదాతలు దగా పడుతున్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్ధతు ధర రావడం లేదని తెలిసింది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కాకుండా మార్కెట్లో కొందరు రైతులను మోసం చేస్తున్నారని సమాచారం. రైతులు సైతం మద్దతు రాకపోవవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రైతుల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. క్వింటాల్ సన్న రకం ధాన్యం మద్దతు ధర రూ.2800 నుంచి రూ.3 వేలు ఉండగా.. క్వింటాల్ ధాన్యానికి రూ.2100 ఇస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు పంట కొనుగోలు ఎప్పుడు చేస్తారో తెలియక మార్కెట్లో రైతుల పడిగాపులు కాస్తున్నారు.