మ్యాజిక్ బాక్స్ ఓపెన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

-

రంగారెడ్డి జిల్లాలోని మంచిర్యాలలో గల గ్రేహౌండ్స్ క్యాంపస్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ గురువారం ఉదయం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో పోలీస్ కుటుంబాల పిల్లలకు 50 శాతం సీట్లను కేటాయించగా.. మరో 50 శాతం సామాన్యుల పిల్లల కోసం కేటాయించారు.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మ్యాజిక్ బాక్స్‌ను మీడియా ముందు ఓపెన్ చేశారు. అందులో యూనిఫామ్, స్పోర్ట్స్ డ్రెస్‌, బుక్స్, వాటర్ బాటిల్‌తో పాటు విద్యార్థులకు అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయి. ఈ మ్యాజిక్ బాక్స్‌లను యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news