వైరల్ వీడియో : రోడ్డు పాలైన ట్యాంకర్‌ పాలు..!

-

ట్యాంకర్ పాలను రోడ్డుపై పారబోస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన బెంగళూరు – పుణె రహదారిపై మంగళవారం జరిగింది. మహారాష్ట్రకు చెందిన స్వాభిమాన్‌ షెట్కారీ సంఘటన్‌ అనే రైతు సంస్థకు చెందిన సభ్యులు పాల ధర పెంచాలని డిమాండ్‌ చేస్తూ నిరసనగా పాల ట్యాంకర్లను ఆపి పుణె-బెంగళూరు రహదారిపై పారబోశారు. ఆవుపాల కనీస రేటు, ఇతర వస్తువులతో కలిపి లీటరుకు రూ.25 చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్లు ఈ డిమాండ్ల వెనుక కారమణమన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసనలను ఉధృతం చేయాలని కూడా రైతు సంఘం నిర్ణయించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాల ధర లీటర్‌కు రూ.5 పెంచాలని, పాల ఉత్పతిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ‘పాల ఉత్పత్తిదారులకు రూ.30 ఎగుమతి రాయితీని, పాల ఉత్పత్తులపై విధించే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version