కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ శివారులో జరుగుతున్న రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటి దాకా జరిగిన ఎనిమిది దఫాల చర్చలు విఫలం కాగా ఈ రోజు 9వ దఫా చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విజ్ఞాన భవన్ లో రైతు సంఘాల ప్రతినిధులు అలాగే కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు. సాగు చట్టాల రద్దు, విద్యుత్ విధానం తదితర అంశాల మీద ఈ రోజు చర్చ జరగనుంది. అయితే కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు విషయం మీద ఈ రోజు జరిగనున్న తొమ్మిదో విడత చర్చలలో చెప్పుకోదగిన పురోగతి ఉంటుందని తమకు నమ్మకం లేదని రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఈ రోజు జరిగే చర్చలు కేంద్రంతో చివరి చర్చలు అని వారు చెబున్నారు.