కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై రోజురోజుకూ నిరసన ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మొన్నటివరకు సాగుకు నీటిని అందించలేదని, ఇప్పుడు పండించిన వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వడ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలోని దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండాలో రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు.20 రోజుల నుండి ఐకేపీలో ఎలాంటి కాంటాలు జరగక, లారీలు రాక గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్లే వడ్లని తగలబెట్టినట్లు తెలుస్తోంది.ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుండి రైతుల బతుకులు ఆగమైతున్నాయని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు.