వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీరుపై ఇప్పటికే బీజేపీ ఎంపీలు ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఆయన మరోసారి న్యాయవ్యవస్థ తీరుపై ఘాటు కామెంట్స్ చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఎన్నికైన ప్రతినిధులు రాజ్యాంగంలో అంతిమ మాస్టర్లు అని ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ అన్నారు. చెప్పారు. ‘‘పార్లమెంట్ అత్యున్నతమైంది’’ అని ఆయన పునరుద్ఘాటించారు. రాజ్యాంగం ప్రజల కోసం అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదని.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అల్టిమేట్ మాస్టర్లు అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ కన్నా మించిన ఏ అధికారాన్ని రాజ్యాంగం ఇవ్వలేదన్న ఉపరాష్ట్రపతి.. పార్లమెంట్ అత్యున్నతమైందని.. దేశంలో ప్రతీ వ్యక్తిలాగే ఇది కూడా అత్యున్నతమైందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖఢ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.