పార్కింగ్ కోసం ఫాస్టాగ్ పద్దతి.. పేటీఎమ్ వినూత్న ఆలోచన

-

జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల మీద ఫాస్టాగ్ పద్దతిన టోల్ చెల్లిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫాస్టాగ్ పద్దతిలో రీఛార్జ్ చేసుకుని టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు వాహనాలు నిలవకుండా ఉండేందుకు ఈ పద్దతి ఉపయోగపడుతుంది. ఐతే ప్రస్తుతం పార్కింగ్ కి కూడా ఫాస్టాగ్ పద్దతిని ఉపయోగించాలని పేటీఎమ్ భావిస్తుంది. ఈ మేరకు ప్రణాళిక రచిస్తుంది. పార్కింగ్ లో నిలిపే వాహనాలు ఫాస్టాగ్ పద్దతిలో డబ్బులు చెల్లించే విధానాన్ని తీసుకురానుంది.

ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఈ సేవలను ఢిల్లీ మెట్రో పార్కింగ్ స్థలాల్లో ప్రారంభించింది. యూపీఐ ఆధారిత చెల్లింపులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పద్దతిని దేశవ్యాప్తంగా తీసుకువచ్చేందుకు పేటీఎమ్ సిద్ధం అవుతుంది. షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, విమానాశ్రయాలు ఈ ఫాస్టాగ్ పార్కింగ్ పద్దతిని ప్రవేశ పెట్టనుంది. మరి ఈ పాస్టాగ్ పార్కింగ్ పద్దతి ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version