డిసెంబర్‌ 1 నుండి అన్ని వాహనాలకు ‘ఫాస్టాగ్‌’ తప్పనిసరి

-

ఫాస్టాగ్‌ లేని వాహనాల కోసం ఒకేఒక్క లేన్‌ను కేటాయించాలని నిర్ణయించిన కేంద్రం, వివిఐపీల వాహనాలకు జీరో బ్యాలెన్స్‌ ట్యాగులు అందజేయాలని, అందుకు వారు ముందుగా భారత జాతీయ రహదారుల సంస్థకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది.

ఫాస్టాగ్‌ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. డిసెంబర్‌ 1 నుండి జాతీయ రహదారులపై ప్రయాణించే అన్ని రకాల వాహనాలకు ‘ఫాస్టాగ్‌’ తప్పనిసరిగా ఉండాలని, తద్వారా వాహనదారులకు టోల్‌ గేట్ల వద్ద నగదు చెల్లించే అవసరము, వేచిఉండటం ద్వారా వృధా అయ్యే సమయం తప్పతాయని తెలిపింది. ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలు, టోల్‌గేట్ల వద్ద ఆగకుండానే వెళ్లిపోవచ్చు. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ కార్యక్రమం కింద జాతీయ రహదారుల సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

FASTag mandatory for all vehicles from December 1

వ్యక్తిగత వాహనాల కన్నా, వాణిజ్య వాహనాలకు ఫాస్టాగ్‌ల వల్ల గొప్ప ఊరట లభించనుంది. వేలాది కిలోమీటర్లు ప్రయాణించే ఈ వాహనాలకు, టోల్‌గేట్ల వద్ద క్యూలలో నిల్చునే బాధ తప్పడంతో పాటు, ఎంతో సమయం, ఇంధనం బాగా ఆదా అయ్యే అవకాశముంటుంది. ఫాస్టాగ్‌ లేకుండా పొరపాటున ఆ లేన్‌లోకి ప్రవేశించిన వాహనం రెట్టింపు రుసము చెల్లించాల్సివుంటుంది. ప్రస్తుతానికి ఫాస్టాగ్‌ లేని వాహనాల కోసం ఒకే ఒక్క లేన్‌ కేటాయించాలని తెలిపిన కేంద్రం, కొంతకాలం తర్వాత ఆ రుసుమును రెట్టింపు చేయాలని కూడా నిర్ణయిందింది, అయితే ఇది ఎంత కాలమో ఇంకా చెప్పలేదు. ఫాస్టాగ్‌ అమలును దేశవ్యాప్తంగా ప్రోత్సహించడం కోసం, ఫాస్టాగ్‌ల ద్వారా చెల్లించిన రుసుములో నుండి 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 5శాతం, 2019-20కి 2.5శాతం క్యాష్‌బాక్‌ కూడా ఇవ్వనున్నారు. ఈ మొత్తం నెల అయిపోగానే అదే ఫాస్టాగ్‌ ఖాతాలోకి జమ అవుతుంది.

ప్రస్తుతానికి ఇది జాతీయ రహదారుల వరకే వర్తించినా, రాష్ట్ర రహదారులకు కూడా అందుబాటులోకి తేవాలని అన్ని రాష్ట్రాలు నిర్ణయించినట్లు తెలిసింది. కాకపోతే, అవలంబనాపద్దతులు, ఒప్పందాల కారణంగా ఇది కొంత అలస్యమయ్యే అవకాశముంది. వచ్చే మార్చి నుండి ఫాస్టాగ్‌లు రాష్ట్ర రహదారులకు కూడా విస్తరించేందుకు రాష్ట్రాలు గడువు విధించుకున్నాయి.

ఫాస్టాగ్‌ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

FASTag mandatory for all vehicles from December 1

మామూలుగా చెప్పాలంటే ఫాస్టాగ్‌ అనేది ఒక స్టిక్కర్‌. ఇందులో రేడియో తరంగాల ద్వారా గుర్తింపబడే (ఆర్‌ఎఫ్‌ఐడి) ఒక యాంటెన్నా ఉంటుంది. దీన్ని వాహనం ముందు అద్దంపై మధ్యలో (రివ్యూ మిర్రర్‌ కింద) అతికించాలి. ఎప్పుడైతే వాహనం టోల్‌గేట్‌లోకి ప్రవేశిస్తుందో, అక్కడ బిగింపబడ్డ పరికరం ఈ ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేస్తుంది. తద్వారా ట్యాగ్‌ ప్రత్యేక అంకెను, వాహన తరగతిని, రిజిస్ట్రేషన్‌ నంబరును అలాగే యజమాని పేరును గ్రహించి, సంబంధిత బ్యాంకుకు పంపుతుంది. ఆ వివరాలను బ్యాంకు ఎన్‌ఈటీసీ (నేషనల్‌ ఎలాక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌) సర్వర్‌ ద్వారా ఖరారు చేయబడి, తిరిగి టోల్‌ ప్లాజా సర్వర్‌కు చేరుకుని, నిర్ధారిత రుసుమును ఫాస్టాగ్‌ ఖాతానుండి తమ ఖాతాకు బదిలీ చేస్తుంది.

ఫాస్టాగ్‌ స్కిక్కర్‌ను జాతీయ రహదారుల సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, వాహనం ముందు అద్దానికి సరిగ్గా మధ్యలో (రివ్యూ మిర్రర్‌ కింద) లోపలివైపు నుండి అతికించాలి.

ఎలా తీసుకోవాలి?

డెసెంబర్‌ 1 నుండి కేంద్రం ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసింది కాబట్టి, కొత్తగా మార్కెట్లోకి విడుదలయ్యే వాహనాల్లో ముందుగానే ఫాస్టాగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయబడివుండాలని ఆటోమొబైల్‌ రంగాలను కేంద్రం ఆదేశించింది. ఇక ఇప్పుడున్న పాత వాహనాలకు మాత్రం ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాల్సివుంటుంది. ఫాస్టాగ్‌ల జారీ కోసం కేంద్రం ఇప్పటికే 23 బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫాస్టాగ్‌లను తమ బ్యాంకు ఖాతాలకు అనుసంధానించుకోవడం ద్వారా, లేదా ప్రిపెయిడ్‌ పద్ధతిలో రిచార్జ్‌ చేసుకోవడం ద్వారా రుసుమును అందుబాటులో ఉంచుకోవచ్చు. ఫాస్టాగ్‌ టోల్‌గేట్‌ ద్వారా వాహనం వెళ్లిపోతుండగానే ఆ ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేసే పరికరం మన ఖాతాలోనుండి వాహన తరగతిని బట్టి నిర్ధారిత రుసుమును తన ఖాతాలోకి మార్చుకుంటుంది. ఎస్‌బిఐ, కోటక్‌, ఐసిఐసిఐ, యాక్సిస్‌ బ్యాంకులతో సహా ఇతర ఆర్థిక సంస్థలు ఇప్పటికే ఫాస్టాగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసాయి. ఆ యా బ్యాంకుల ఖాతా వినియోగదారులు తమ ఖాతానే ఫాస్టాగ్‌కు అనుసంధానించుకోవచ్చు. ఆ ఏర్పాట్లు కూదా బ్యాంకులు తమ నెట్‌ బ్యాంకింగ్‌ సౌలభ్యం ద్వారా తన ఖాతాదారులకు అందిస్తున్నాయి.

FASTag mandatory for all vehicles from December 1

బ్యాంకు ఖాతా లేని వారు, వ్యాలెట్ల ద్వారా, బ్యాంకు వెబ్‌సైట్ల ద్వారా కూడా ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చు. అందుకు ఆధార్‌ కార్డ్‌, వాహన ఆర్‌సి, పాస్‌పోర్డ్‌ ఫోటో అప్‌లోడ్‌ చేయాల్పిఉంటుంది. ట్యాగ్‌ జాయినింగ్‌ ఫీజు కింద 200 రూపాయలు, వాహన తకగతిని బట్టి ధరావత్తు మొత్తం, ట్యాగ్‌లో ఉండాల్సిన కనీస నిల్వను మొదటిసారిగా చెల్లించాల్సివుంటుంది. దీన్ని కూడా క్రెడిట్‌, డెబిట్‌కార్డులు, వ్యాలెట్లు, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చు. వివరాలన్నీ సరిపోల్చుకున్న తర్వాత వాహన ప్రత్యేక ఫాస్టాగ్‌, కొరియర్‌ ద్వారా ఇంటికి చేరుతుంది. తర్వాత అవసరాన్నిబట్టి దీన్ని రీచార్జ్‌ చేసుకోవచ్చు లేదా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతానుండి బదిలీ చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాగ్‌ను ఎప్పుడైనా ఉపసంహరించుకున్నట్లయితే ధరావత్తు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. వాహన తరగతిని బట్టి చార్జీలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version