ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ సింగల్ హత్య సంచలనంగా మారింది ఇప్పుడు మరికొన్ని గంటల్లో పెళ్లి పీట మీద ఉండాల్సిన వరుడు హత్యకి గురయ్యాడు. గౌరవ్ సింగల్ అతని తండ్రి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. తండ్రి రంగలాల్ హత్య చేశాడని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం చెప్పారు. తనని రోజు తిడుతుండే వాళ్ళని కోపంతో రంగలాల్ ఈ హత్యకి పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు.
దక్షిణ ఢిల్లీలో గౌరవం అతని ఇంట్లో అర్ధరాత్రి హత్యకి గురయ్యాడు. తెల్లవారితే అతని పెళ్లి ఈ సమయములోనే తండ్రి చేతిలో హత్యకి గురవడం సంచలనంగా మారింది. పరారీలో ఉన్న నిందితుడు రంగలాలని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇంకో ముగ్గురు పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు గురువారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో పోలీసులు కి హత్య గురించి ఫోన్ వచ్చింది ఘటన స్థలానికి వెళ్లేసరికి రక్తపు మడుగుల్లో బాధితుడు పడి ఉన్నాడు.