రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈ తరుణంలోనే… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఒక్కొక్క బాక్స్ లో 400 కి పైగా ఓట్లు పట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఒక టీంలో పీ ఓ, ఏ పీ ఓ, ఇద్దరు ఓ పీ ఓ లు, ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు.
డిస్ట్రిబ్యూటర్ సెంటర్ల నుంచి మెటీరియల్ తీసుకుని పోలింగ్ కేంద్రాల కి వెళ్తున్నారు పోలింగ్ సిబ్బంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 35 మంది అభ్యర్థులతో బ్యాలెట్ పేపర్ లు రెడీ చేశారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇవాళ, రేపు విద్యా సంస్థలకు హాలీడే కూడా ప్రకటించారు.