కొవ్వుగడ్డలు..పోయేదేలా.. అసలు వచ్చినవి అవేనా..?

-

కొందరికి చర్మం కింద కొవ్వు గడ్డలు వస్తుంటాయి. ఇవి ఎందుకు వస్తాయో కూడా వాళ్లకు తెలియదు. సాధరణంగా.. 30-40 ఏళ్ల తర్వాతే ఇవి వస్తాయి.. కానీ ఈరోజుల్లో యువత సైతం ఈ సమస్యతో బాధపడుతున్నారు. వైద్య పరిభాషలో వీటిని లైపోమా, ఫ్యాట్‌బాల్స్ అంటారు. బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైతే ఇవి వస్తాయి.

చర్మం, కండర పొరకు మధ్యలో ఏర్పడుతుంటాయి. ఈ గడ్డలు ఎందుకు వస్తాయన్నది కచ్చితంగా తెలియదు. కొందరిలో వంశ పారంపర్యంగా తలెత్తొచ్చు. వీటిని కొందరు క్యాన్సర్‌ గడ్డలనుకుని భయపడుతుంటారు. కానీ ఇవేమీ హాని చేసేవి కావు. కొవ్వు గడ్డలు మృదువుగా ఉంటాయి. వేలితో నొక్కితే కదులుతుంటాయి, పట్టుకుంటే జారిపోతుంటాయి. వీటికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. అలాగే ఉన్నా ఏమీ కాదు. మున్ముందు ఇతరత్రా ఇబ్బందులేవీ ఉండవు.

అయితే ముఖం, మెడ వంటి చోట్ల చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తున్నా.. గడ్డలు పెద్దగా అవుతున్నా, నొప్పి పెడుతున్నా తొలగించుకోవచ్చు. చిన్నపాటి కోతతో వీటిని తేలికగానే తీసేయొచ్చట.. అయితే న్యూరోఫైబ్రోమాటోసిస్‌ జబ్బులోనూ నాడీకణజాలం మీద గడ్డలు ఏర్పడుతుంటాయి. అందువల్ల వచ్చినవి కొవ్వు గడ్డలేనా? న్యూరోఫైబ్రోమాటిసిసా? అనేది వైద్యులతో పరీక్షించుకోవాల్సి ఉంటుంది. నాడీకణజాలం మీద ఏర్పడే గడ్డలు కూడా లైపోమా మాదిరిగానే మృదువుగా ఉంటాయి. కానీ గడ్డలతో పాటు ఒంటి మీద ముఖ్యంగా చంకల్లో చిన్నగా, గుండ్రంగా నల్లటి మచ్చలు (ఫ్రెకిల్స్‌).. కాఫీ రంగులో మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. ఇలాంటివి లేకపోతే లైపోమాగా భావించొచ్చు. చర్మ నిపుణుడిని సంప్రదిస్తే పరీక్షించి ఎలాంటి రకం గడ్డలనేవి నిర్ధరిస్తారు. అవసరమైతే గడ్డ నుంచి చిన్న ముక్క తీసి పరీక్షిస్తారు.

కొవ్వుగడ్డలు యువతకు రావడానికి ఒక కారణం.. వర్క ఫ్రమ్ హోమ్ కారణంగా..కదలకుండా ఒకే పొజిషన్ లో గంటల తరబడి కుర్చోడం. దీని కారణంగా..ఫ్యాట్ అంతా ఒకే చోట ఫామ్ అయి.. గడ్డలుగా టైస్ మీద ఏర్పడుతుంది. ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఈ మధ్య వస్తున్నాయి. వీటిని టాబ్లెట్స్, ఆయిల్ మసాజ్, పోషకాహారం, వ్యాయామం ద్వారా తగ్గించుకోవచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version