బాయిల్డ్ రైస్ ను పెట్టించిందే ఎఫ్‌సీఐ – సీఎం కేసీఆర్

-

యాసంగి లో వ‌రి ధాన్యం బియ్యం కాక పోవ‌డం తో ఎఫ్‌సీఐ యే బాయిల్డ్ రైస్ ను పెట్టించింద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. బాయిల్డ్ రైస్ లేకుంటే తెలంగాణ రైతులు న‌ష్ట పోతార‌ని అన్నారు. తెలంగాణ లో యాసంగి లో మొత్తం బాయిల్డ్ రైస్ మాత్రమే వ‌స్తాయ‌ని అన్నారు. అందుకే బాయిల్డ్ రైస్ ను ఎఫ్ సీ ఐ అమోదం తెలిపింద‌ని అన్నారు. కాగ యాసంగి లో ఎండ ల తీవ్ర‌త ఎక్కువ ఉన్నందునే రైస్ ను బాయిల్డ్ రైస్ అవుతుంద‌ని అన్నారు.

మిగత కాలంలో వ‌రి ధాన్యం బాయిల్డ్ రైస్ కాద‌ని అన్నారు. కాగ బాయిల్డ్ రైస్ ను పెట్టించిన ఎఫ్ సీఐ యే ఇప్పుడు ఒక గింజ బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయ‌మ‌ని తెల్చి చెప్పింద‌ని అన్నారు. అలాగే బాయిల్డ్ రైస్ వ‌ల్ల ఇటు రైతులు.. అటు రైస్ మిల్లు లు లాభం పోందుతార‌ని అన్నారు. అయితే బాయిల్డ్ రైస్ ను తెలంగాణ రాష్ట్రం ఎక్కువ పండిస్తుంద‌ని ఈర్ష తో నే ఇప్పుడు అవి కొనుగోలు చేయ‌మ‌ని అంటున్నార‌ని విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version