దెయ్యం భయం.. ప్రతి గురువారం ఆ కాలనీ ఖాళీ..!

-

గురువారం వచ్చిందంటే ఆ ఊరి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గజగజలాడుతుంటారు. దెయ్యం భయంతో కాలనీ అంతా ఖాళీ అయిపోతుంది. 40 కుటుంబాలు ఉన్న ఊరిని, ఇంటిని వదిలేసి పెట్టే మూట సర్దుకుని వెళ్లిపోయారంటే అక్కడ దెయ్యం ఏ రేంజ్‌లో భయపెడుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇంతకీ అది ఏ ఊరు.. ఆ దెయ్యం కథేంటో తెలుసుకోవాలని ఉందా..

Colony-Janagon

తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామం. గ్రామంలో బేడ బుడగ జంగాల కాలనీ ఒకటి ఉంది. ఆ కాలనీలో 40 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కాలనీకి చెందిన చింతల భాను, బాల రాజు అన్నదమ్ముళ్లు. వీరిద్దరు గతేడాది అక్టోబర్ నెలలో అమావాస్యకు ముందు మొదటి గురువారం ఒకరు, రెండో గురువారం మరొకరు మరణించారు. వారం రోజుల వ్యవధిలోనే వీరిద్దరూ దుర్మరణం చెందడం వారిలో భయాన్ని రేకెత్తించింది. గ్రామానికి చెందిన ఓ మహిళ చేతబడితో దెయ్యాన్ని సృష్టించిందని, కాలనీలోని పాత బంగ్లాలో ఆ దెయ్యం ఉంటోందన్న పుకార్లు అక్కడి ప్రజలను మరింత భయాందోళనకు గురిచేశాయి.

రోజూ రాత్రిళ్లు ఆ దెయ్యం నగ్నంగా రోడ్లపై తిరుగుతోందనీ, ఆ దెయ్యం నీడ పడిన వాళ్లు చనిపోతున్నారని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. దీనికి తోడు కాలనీకి చెందిన గంధం రాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈయన చనిపోయింది కూడా అమావాస్యకు ముందు వచ్చే గురువారమే. దీంతో ఆ కాలనీవాసులు బెంబేలెత్తిపోయారు. ఇక్కడే ఉంటే చనిపోవటం ఖాయమని ఫిక్స్ అయి మొత్తంగా 40 కుటుంబాలు ఆ కాలనీని వదిలి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఆ కాలనీ అంతా నిర్మానుష్యంగా మారింది.

అయితే చనిపోయిన మొదటి ఇద్దరిలో ఒకరు మూర్ఛవ్యాధితో మరణించాడు. మరొకరు అనారోగ్యంతో మరణించాడు. మూడో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కానీ, ముగ్గురూ గురువారమే మరణించడం, వారంతా యువకులు కావడంతోనే పుకార్లు ఓ రేంజ్‌లో చెలరేగాయి. వాటిని నమ్మి ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. పోలీసులు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా వాళ్లు వినలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version