రాష్ట్రంలో మొన్నటివరకు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు మరువక ముందే తాజాగా కేజీబీవీలోని విద్యార్థినులు తమకు ఆహారం సరిగా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడుస్తూ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో వారు పాఠశాల వద్దకు వచ్చి పిల్లలను చూసేందుకు ప్రయత్నించగా.. యాజమాన్యం అందుకు అంగీకరించలేదని సమాచారం.
దీంతో పేరెంట్స్ మేనెజ్మెంట్‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. తమ పిల్లలకు తిండి పెట్టడం ఈ ప్రభుత్వంతో కాదని, కేజీబీవీ ముందు ఆందోళన చేసి తమ పిల్లలను తల్లితండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. విద్యార్థులకు భోజనం సరిగా పెట్ఝడం లేదనే కారణంతో తమ పిల్లల్ని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్లినట్లు సమాచారం.
మా పిల్లలకు తిండి పెట్టడం ఈ ప్రభుత్వంతో కాదు
ఏడుస్తూ తల్లితండ్రులకు ఫోన్ చేసిన విద్యార్థినులు
పిల్లలను చూడటానికి అనుమతించని యాజమాన్యం
కేజీబీవీ ముందు ఆందోళన చేసి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన తల్లితండ్రులు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో… pic.twitter.com/Ax7lk7YfW0
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2024