బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరఫున ఆడుతున్న తెలుగుతేజం నితిశ్ కుమార్ రెడ్డి నిన్న సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.దీంతో నితీశ్‌ను క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలతో ముంచెత్తారు. సీనియర్ క్రికెటర్లు అంతా బ్యాటింగులో విఫలమైన వేళ నితీశ్ మరియు వాషింగ్టన్ సుందర్ మాత్రమే జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
అందులో నితీశ్ అద్బుతమైన సెంచరీ పూర్తి చేసుకోగా.. సుందర్ అర్థసెంచరీతో పరవాలేదని పించాడు. నితిశ్ సెంచరీ చేసిన సమయంలో అతని తండ్రి ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం నితీష్ కుమార్‌పై మాజీ దిగ్గజం గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాక్సింగ్ డే టెస్టు బ్రేక్ సమయంలో నితీశ్ కుమార్ తండ్రి కామెంట్రీ బాక్స్‌లోని సునీల్ గవాస్కర్‌ను కలిసి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.వెంటనే సన్నీ ఆయన్నే పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గవాస్కర్ కాళ్ళు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి
నిన్న సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ పై గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే
బాక్సింగ్ డే టెస్టు బ్రేక్ సమయంలో నితీశ్ కుమార్ తండ్రి కామెంట్రీ బాక్స్ లోని సునీల్ గవాస్కర్‌ను కలిసి ఆయన కాళ్లకు నమస్కరించి… pic.twitter.com/Kgrn3TWDc7
— Telugu Scribe (@TeluguScribe) December 29, 2024