మీకు యాభై ఏళ్ళు దాటాయా…? వయసు పైబడుతోందని చింతిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. వయస్సు లో ఉన్నప్పుడు ఏమి తిన్న పరవాలేదు. కానీ వయస్సు పెరిగే కొద్దీ శరీర అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. కనుక ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ విషయం లో మరింత జాగ్రత్త అవసరం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..? శరీరానికి శక్తి చాలా అవసరం.
ఆకు కూరలు, చేపలు , తక్కువ కొవ్వు పాల పదార్థాలు, తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్ డి, క్యాల్షియం తగినంత పొందవచ్చు. వీటిని కనుక మీరు తీసుకుంటే ఇవి ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయ పడతాయి. వీలైనంత వరకు నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించాలి. నెయ్యి, డాల్డా వంటివి కూడా పూర్తిగా తగ్గిస్తే మంచిది. రోజు కాసేపు నడవడం, తేలిక పాటి వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆనందంగా ఉంటె మంచిది.