సీట్‌ కోసం విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ.. వీడియో వైరల్‌..

-

బస్సుల్లో, మెట్రో ట్రైన్స్‌లో సీట్‌ కోసం కొట్టుకోవడం చూసి ఉంటాం.. ఇంకా ముంభై లోకల్‌ ట్రైన్స్‌లో అయితే.. జుట్టుపట్టుకోని మరీ కొట్టుకుంటారు.కానీ మీరు విమానంలో సీట్‌ కోసం కొట్టుకోవడం చూసి ఉంటారా.. విమానంలో ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా సీట్‌ కోసం తన్నుకున్నారు. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

క్యాబిన్ క్రూ సేఫ్టీ నిబంధనలు గురించి చెబుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రయాణికుల మధ్య ఈ పంచాయితీను తీర్చడం విమాన సిబ్బందికి తలనొప్పిగా మారింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఈ నెల 26న బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు థాయి స్మైల్ ఎయిర్ వేస్ విమానం బయల్దేరింది. అయితే విమానాం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో ఇద్దరి ప్రయాణికుల మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. అది కాస్త చిలికి చిలికి గాలివాన అయింది. ఇలా ఇద్దరు మాటకు మాట పెంచుకుంటూ వాదులాడుకుంటున్నారు. ఇద్దర్నీ విమాన సిబ్బంది వారించే ప్రయత్నం చేశారు. అయినా వారి మధ్య గొడవ ఆగలేదు.

ఇంతలో ఓ వ్యక్తి తన కళ్లజోడును తీసి ఎదురుగా ఉన్న నల్ల చొక్కా ధరించిన వ్యక్తిని కొట్టడం, అతడికి మద్దతుగా వచ్చిన స్నేహితులు కూడా ఆ ప్రయాణికుడిపై దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఐదుగురు వ్యక్తులు దాడి చేయడంతో అతడు వారి నుంచి రక్షించుకునే ప్రయత్నం చేశాడు. ప్లీజ్ ఆపండి అని క్యాబిన్ సిబ్బంది అరుస్తున్నా పట్టించుకోకుండా ఆ ప్రయాణికుడిపై పిడిగుద్దులు కురిపించాడు. ఆ దెబ్బలను అడ్డుకుంటూ, తాను కూడా కొట్టడానికి నల్ల చొక్కా ధరంచిన వ్యక్తి ప్రయత్నించాడు.

ఈ గొడవను ఆపేసేందుకు ఫ్లైట్ అటెండెంట్ ప్రయత్నించాడు. చివరకు తోటి ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇంత జరుగుతున్నా తోటి ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు. తప్ప ఏం చేయలేదు.. ఇక సోషల్‌ మీడియా పిచ్చోల్లు మాత్రం.. ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రాతిపదికగా తీసుకుని సంబంధిత విమాన యాన సంస్థ నుంచి నివేదిక కోరామని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. భారత్‌కు సంబంధించి విమానయాన భద్రతకు ఈ బీసీఏఎస్ బాధ్యత వహిస్తుంది. అయితే ఈ ఘటనపై థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు, విమానంలో ప్రయాణికుడిని కొట్టిన ఐదుగురుని జీవితంలో ఫ్లైట్ ఎక్కకుండా బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్లు చేస్తున్నారు. అసలు వీళ్లకు సీట్‌ దగ్గర ఎందుకు గొడవ అయిందో.. చెక్‌ఇన్‌ చేసుకున్నప్పడే సీట్‌ కన్ఫామ్‌ చేసుకుంటారు కదా..! మరీ వీళ్లకు గొడవ ఎందుకు వచ్చిందో..?

Read more RELATED
Recommended to you

Exit mobile version