అంజనీ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత బలపడుతుంది – మహేందర్ రెడ్డి

-

36 సంవత్సరాలు పోలీస్ శాఖలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు మాజీ డిజిపి మహేందర్ రెడ్డి. కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ కి అభినందనలు తెలియజేశారు. అంజనికుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత బలపడుతుందన్నారు. తన సర్వీస్ లో హోమ్ గార్డ్ నుంచి పోలీస్ ఆఫీసర్ల వరకు ఆయనకి సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నామన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీసులున్నారనే నమ్మకాన్నిచ్చింది పోలీస్ వ్యవస్థ అని.. పోలీస్ శాఖలో పనిచెస్తున్న వారి జీతభత్యాలు, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు. ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్సులు, హోమ్ గార్డులకు 20 వేల జీతాన్ని ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని కొనియాడారు. ఇప్పటికే 27 వేల పోలీసులను రిక్రూట్ చేసుకోగా… త్వరలో మరో 17 వేల మంది పోలీస్ శాఖలో చేరనున్నారని తెలిపారు.

పోలీస్ శాఖలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్నో కేసులు పరిష్కరించామని గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో నేరాలన్ని డిజిటల్ రూపంలో జరుగుతాయని.. కాబట్టి పోలీసులందరూ టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలని సూచించారు. విజనరీ దృష్టిలో ఉంచుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version