Breaking : నార్సింగీ సదర్ ఉత్సవాలలో ఇరు వర్గాల‌ మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీచార్జ్‌

-

హైదరాబాద్‌లో సదర్‌ ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సదర్‌ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతాయి. అయితే.. నిన్న రంగారెడ్డి జిల్లాలోని నార్సింగీ సదర్ ఉత్సవాలలో ఇరు వర్గాల‌ మద్య ఘర్షణ జరిగింది. నార్సింగీ మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆశోక్ యాదవ్ మధ్య వివాదం తలెత్తింది. దున్న రాజుల ఊరేగింపులో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఘర్షణతో… ఒకరి పై ఒకరు దాడికి దిగారు. ఇరు గ్యాంగ్ లు. కర్రలతో, రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో.. నార్సింగీ పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేశారు.

ఇరు వర్గాలను చెదరగొట్టిన కాప్స్. ఇరు వర్గాల పై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో.. ఒక్కసారిగా ఉద్రిక్తతకు సదర్ ఉత్సవాలు దారి తీశాయి. మాజీ సర్పంచ్ ఆశోక్ యాదవ్ ఇంటిపై రాళ్ల తో దాడి చేసిన వెంకటేష్ యాదవ్ గ్యాంగ్. దాడి లో గాయపడ్డ ఆశోక్ యాదవ్. వారి అనుచరులు. ఉదయ్, క్యాంతమ్ సతీష్, బాలు, క్యాంతమ్ ఆశోక్, క్యాంతమ్ అరవింద్, అశోక్ యాదవ్, విజయ్, జెల్లి అరవింద్, కొండా రాము పై కేసులు నమోదు. మొత్తం 13 మంది కి గాయాలు. ఆసుపత్రి లో చికిత్స. గత రెండు సంవత్సరాల క్రితం కొమరవల్లి వద్ద కత్తులతో కొట్టుకున్న వెంకటేష్ యాదవ్, ఆశోక్ యాదవ్. ఇద్దరి పై హత్యాయత్నం కేసులు నమోదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version