బస్సులో సీటు కోసం గొడవ.. కిందకు దిగి కొట్టుకున్న మహిళలు

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫ్రీ బస్సు తేవడం పథకం వలన టికెట్లు తీసుకుని మరీ మగవారు నిలబడి జర్నీలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న మహిళలేమో సీట్ల కోసం గొడవ పెట్టుకుంటున్నారు. కొందరైతే ఏకంగా జట్లు పట్టుకుని మరీ బస్సులో కొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనలు ఈ ఏడాది కాలంలో అనేకంగా వెలుగుచూశాయి. తాజాగా వనపర్తి జిల్లా గణపురంలో ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు గొడవకు దిగారు.ఏకంగా బస్సులో నుంచి కిందకు దిగి మరీ జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. వారి గొడవను తోటి ప్రయాణికులు వేడుక చూసినట్లు చూశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news