ఏపీలోని పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు మార్చి 24, 25 తేదీల్లో.. ఏపీ పొల్యూషన్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగాలకు మార్చి 25న రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
అదేవిధంగా గ్రేడ్ -2 అనలిస్టు పోస్టులకు మార్చి 25, 26 తేదీలు, డిప్యూటీ ఎడ్యూకేషనల్ ఆఫీసర్ (డివైఈవో) ఉద్యోగాలకు మార్చి 26,27 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా తేదీలను గుర్తుంచుకోవాలని పూర్తి వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌ను పరిశీలించాలని ఏపీపీఎస్సీ కోరింది.