ఒక దశలో తనని కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తరహాలోనే ఉరితీసి ఆత్మ హత్యగా చిత్రీకరిస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంలోకి రిచా చద్దాని కూడా లాగడంతో రిచా చద్దా పరువు నష్టం దావాకు దిగడంతో ఆమెకు బేషరతుగా క్షమాపణలు చెప్పింది. తాజాగా లైంగిన ఆరోపణల వివాదంలతో వైరల్‌గా మారిన పాయల్ ఘోష్ మొత్తానికి రాజకీయ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చింది. యూనియన్ మినిస్టర్ రాందాస్ అధావలే పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరింది.
పార్టీ మహిళా విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా నియమించబడింది. ఈ సందర్భంగా తను పార్టీలో చేరిన ఫొటోలని పోస్ట్ చేసిన పాయల్ ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేసింది. `రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించానని, రాందాస్ అధావలే సర్ నన్నునమ్మినందుకు దీన్ని అంగీకరించడం నా గౌరవం. దీంతో న్యాయం పొందడానికి నేను ఒక అడుగు దూరంలో వున్నాను. ఒక మహిళగా నేను మహిళా సమాజానికి సేవ చేయడం కూడా సంతోషంగా ఉంది` అని ట్వీట్ చేసింది.
I have been appointed as the vice president for women wing of RPI. Thanks @RamdasAthawale sir for believing in me. This is my honor to accept it. It's one step closer to getting justice.
As a woman I am also happy to serve the women community.🙏
Now the ropes will get tighter. pic.twitter.com/lbnAqwBvx9— Payal Ghosh (@iampayalghosh) October 26, 2020