మన దేశం కరోనా కట్టడికి గానూ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ఆరోగ్య సేతు. దీని ద్వారా కరోనా రోగులను ట్రాక్ చేయవచ్చు అని పేర్కొన్న కేంద్రం ఇది చాలా వరకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలను ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు దీనిని కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి రైలు ప్రయాణాలు చేసిన వారికి ప్రతీ ఒక్కరికి కూడా ఆరోగ్య సేతు యాప్ చాలా కీలకంగా మారింది.
ఇది వారికి తప్పనిసరి అనే ఆదేశాలను కేంద్ర సర్కార్ ఇచ్చింది. ఇక ఇప్పుడు దీనిని మరింత భద్రంగా ఉంచే విధంగా కేంద్రం చర్యలను చేపడుతుంది. తాజాగా దీని భద్రతకు సంబంధించి కేంద్ర సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ లో ఉన్న మూడు భద్రతా పరమైన బగ్స్ కనిపెట్టి చూపించిన వారికి ఒక్కో బగ్ కి లక్ష రూపాయలు ఇస్తామని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ డైరెక్టర్ జనరల్ నీతా వర్మ మీడియాకు తెలిపారు.
నిన్న ఆమె యాప్ ఓపెన్‌సోర్స్ కోడ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. కోడ్ మెరుగుదలకు మంచి సూచనలు చేసిన వారికి కూడా లక్ష రూపాయలను ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఒక యాప్ కి బహుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి అని యాప్ ని ఓపెన్ సోర్స్ ఫ్లాట్ ఫాం గా తాము అందుబాటులోకి తీసుకొచ్చామని ఆమె పేర్కొన్నారు. ఆన్లైన్ డెలివరి చేసే వాళ్ళు అందరూ దీనిని వాడుకోవాలని ఆమె పేర్కొన్నారు.