ఈ తెలంగాణ సర్పంచ్ చాలా స్ట్రిక్ట్ గురూ!

-

ప్రపంచాన్ని అల్లల్లాడిస్తోన్న కరోనా వైరస్… ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. మన దేశం మీద కూడా తన ప్రభావాన్ని చూపించింది. ఈ విషయంలో మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు, పోలీసులు నెతీ నోరూ కొట్టుకుంటున్న పరిస్థితి! అయినా కూడా వినేవాడు వింటూనే ఉండగా… వినని వారు పెడచెవిన పెట్టి అలా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా రోజు రోజుకీ స్ట్రిక్ట్ గా ప్రవర్తిస్తూ ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో మాత్రం పోలీసుల ప్రభావం కాస్త తక్కువగా ఉందని.. దానికి కారణం సిబ్బంది కొరతే అని రకరకాల కామెంట్స్ వస్తున్న తరుణంలో ఆ బాధ్యత తీస్కున్నట్లున్నారు ఒక మహిళ సర్పంచ్!

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కరోనా నియంత్రణకు పలు చర్యలను చేపట్టారు. అందుకుగాను గ్రామాల్లోకి వచ్చేవారి వివరాలను సేకరించి, అత్యవసరం అనుకుంటే తప్ప వారిని గ్రామాల్లోకి రానివ్వడం లేదు. ఈ క్రమంలో తాజాగా గ్రామంలో మాస్కు ధరించని వారిని జరిమానా కూడా విధిస్తున్నారు. పోలీసులు వస్తారులే, రెవిన్యూ సిబ్బంది రంగంలోకి దిగుతారులే అని చూడకుండా ఈ బాధ్యత గ్రామ సర్పంచ్ మీనాక్షి తీసుకున్నారు!

ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామంలో ఓ యువకుడు మాస్కు ధరించకుండా రేషన్‌ బియ్యానికి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామ సర్పంచ్‌ మీనాక్షి, ఆ యువకుడికి రూ.500 జరిమానా విధించింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, అందరు కూడా సామాజిక దూరాన్ని పాటించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. కాగా ప్రజలందరూ కూడా తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తేనే మహమ్మారి కరోనా ని తరిమికొట్టగలమని సర్పంచ్‌ మీనాక్షి గ్రామస్తులకు అందరికి విజ్ఞప్తి చేసుకున్నారు. ప్రతీ సర్పంచ్ కూడా ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే పోలీసుల పని మరింత తేలికవుతుందనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Exit mobile version