టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఆర్థిక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆయన పై కేసు కూడా నమోదు అయింది. ఒక సినిమా నిర్మాణ విషయంలో తన వద్ద నిర్మాత బెల్లంకొండ సురేశ్ రూ. 85 లక్షలు తీసుకుని ఇవ్వలేదని ఫైనాన్షియర్ శరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఈ వివాదంలో నాంపల్లి కోర్టు కూడా జోక్యం చేసుకుంది. దీంతో పోలీసులు నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై కేసు నమోదు చేశారు.
అయితే తాజా ఈ ఆర్థిక వివాదం ముగిసిందని ఫైనాన్షియర్ శరణ్ కుమార్ ప్రకటించారు. కొంత మంది పెద్దల మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదం పరిష్కారం అయిందని శరణ్ కుమార్ తెలిపారు. తమ అకౌంటెంట్స్, బెల్లంకొండ సురేశ్ మేనేజర్ల సమాచార లోపం వల్ల ఈ వివాదం నొలకొందని ప్రకటించారు. అలాగే తమకు రావాల్సిన కొంత డబ్బును కూడా చెల్లించారని తెలిపారు.
కాగ ఈ వివాదంతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు సంబంధం లేదని అన్నారు. అనవసరంగా ఆయన పేరును ఇందులోకి తీసుకువచ్చినందకు క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. కాగ ఈ రోజు శరణ్ కుమార్ సీసీఎస్ కు వచ్చి.. బెల్లంకొండ సురేశ్, శ్రీనివాస్ లపై తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.