ఇన్ కాగ్నిటో మోడ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

-

క్రోమ్ బ్రౌజర్ లో ఇన్ కాగ్నిటో మోడ్ అనేది అందుబాటులో ఉంటుంది. దీని వల్ల హిస్టరీని ఎవరు చూడడానికి అవ్వదు. మనం ఏం సెర్చ్ చేసినా సరే బ్రౌజింగ్ హిస్టరీ లో ఇది కనబడదు. అయితే ఇన్ కాగ్నిటో మోడ్ కి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.

 

మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, టాబ్లెట్ వంటి వాటిలో ఇది ఉంటుంది. మనం వెతికే సమాచారం ఇతరులకు తెలియకుండా ఈ ఇన్ కాగ్నిటో మోడ్ ఉపయోగ పడుతుంది. హిస్టరీ లో మనం వెతికిన సమాచారాన్ని కనపడకుండా ఉండటానికి దీన్ని వాడతారు. మనం దేని గురించి చూసామో ఏ వెబ్సైట్ ని ఉపయోగించాము అనేది కూడా ఎవరికీ తెలియదు.

ఇన్ కాగ్నిటో మోడ్ ని ఎలా ఉపయోగించాలి…?

క్రోమ్ బ్రౌజర్ లో అడ్రస్ బార్ పక్కన ఉన్న మూడు డాట్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మెనూ ఓపెన్ అవుతుంది. అందులో ఇన్ కాగ్నిటో టాబ్ కనబడుతుంది ఒక నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంతే ఇన్ కాగ్నిటో మోడ్ టర్న్ ఆన్ అయ్యినట్టే.

ఇన్ కాగ్నిటో మోడ్ లో ఏం చేసినా, ఏం చూసిన హిస్టరీ లో సేవ్ అవ్వదు. అయితే పాఠశాలలో కంప్యూటర్ అయితే పాఠశాల యాజమాన్యం.. ఇంటర్నెట్ సేవలు కల్పిస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు.. వర్క్ ఏరియా లో పనిచేసే కంప్యూటర్ల లో యజమానులు మాత్రం మనల్ని ట్రాక్ చేయగలరు. కాబట్టి వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version